తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వడగండ్ల వానతో మామిడి రైతు కుదేలు.. రూ. 60కోట్ల నష్టం - వడగండ్ల వాన

వడగండ్ల వానతో బంగాల్​ మాల్డాకు చెందిన మామిడి రైతులు కుదేలయ్యారు. వర్షం ధాటికి రూ. 60కోట్లు విలువ గల మామిడి పంట నష్టపోయారు.

Hailstorm destroys mango worth Rs 60 crore in Malda
కుదేలైన మామిడి రైతులు.. రూ. 60కోట్ల నష్టం

By

Published : Apr 28, 2020, 6:30 AM IST

బంగాల్​లోని మాల్డాలో గత వారం కురిసిన వడగండ్ల వాన మామిడి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఊహించని ప్రకృతి విలయానికి రూ.60కోట్లు విలువ చేసే మామిడి పంట వర్షార్పణం అయింది.

"ఈ నెల 19,20న కురిసిన వడగండ్ల వానతో 60వేల మెట్రిక్​ టన్నుల మామిడి పండ్లు ధ్వంసమయ్యాయి. లంగ్రా, గోపాల్​భోగ్​, లక్ష్మణ్​​భోగ్​ రకాలు మరీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఇంగ్లీష్​ బజార్​, పాత మాల్డా, రాతువా, కలైచక్​ ప్రాంతాలపై అధికంగా ప్రభావం పడింది."

--- రాహుల్​ చక్రవర్తి, మాల్డా ఉద్యాన- ఫుడ్​ ప్రాసెసింగ్​ విభాగం అసిస్టెంట్ డైరక్టర్​.​

బంగాల్​లోని రకరకాల మామిడి పండ్లకు కేంద్రబిందువు మాల్డా. జిల్లాలోని 31వేల హెక్టార్లలో పండ్లు పండుతాయి. ఇక్కడ ఏటా రూ.600 కోట్ల మామిడి వ్యాపారం జరుతుందని అంచనా. సుమారు 4.5 లక్షల మంది మామిడి వ్యాపారంపైనే ఆధారపడుతున్నారు.

ఇదీ చూడండి:-జనరేటర్​ ద్వారా ఇంట్లోకి విషవాయువు-వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details