ఉగ్రవాద రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు చట్టాలను కఠినతరం చేస్తోంది కేంద్రం. ఈ మేరకు ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణలు చేస్తోంది. ఈ బిల్లుకు ఆమోదం తెలపగానే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌లను తొలుత ఉగ్రవాదులుగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా..
చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో అంగీకారం లభించిన తర్వాత చట్టంగా మారనుంది. ఈ చట్టంతో వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అటువంటి వారి ఆస్తులు, ప్రయాణాలపైనా నిషేధం ఉంటుంది. ఈ సవరణలు ఐరాస ఒడంబడికలు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించారు.
"15 ఏళ్లలో 42 సంస్థలను చట్ట వ్యతిరేకమైనవిగా గుర్తించాం. ఇందులో దీన్దార్ అంజుమన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇలా సంస్థల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో.. ఇక నుంచి వ్యక్తులపైనా అలాగే ఉక్కుపాదం మోపుతాం."