దేశంలో సైబర్ దాడుల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు హ్యాకర్ల బారిన పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం చోరీ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు దుండగులు. అలాంటి అనుభవమే ఎదురైంది ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి. అతని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, కుటుంబ రహస్య సమాచారాన్ని దొంగిలించి.. ఆన్లైన్లో పెడతామని బెదిరించారు. రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గాజియాబాద్‌లోని వసుంధర కాలనీకి చెందిన రాజేశ్ తన ఈ-మెయిల్ హ్యాక్‌కు గురైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. హ్యాకర్లు తమ కుటుంబ కదలికలను గమనిస్తూ.. నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.