కరోనా నియంత్రణకు సరైన జాగ్రత్తలు పాటించని వారిపై మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా అధికారులు వినూత్న చర్యలకు ఉపక్రమించారు. మాస్కులు ధరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారు ఇకపై ఆసుపత్రులు, పోలీస్ చెక్ పోస్టుల్లో మూడు రోజుల పాటు వలంటీర్లుగా పనిచేయాలని తేల్చిచెప్పారు.
మాస్కు లేకపోతే వలంటీర్లుగా మారాల్సిందే! - మధ్యప్రదేశ్ కరోనా వైరస్
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా.. కరోనా నిబంధనలను పాటించకపోయినా మూడురోజుల పాటు ఆసుపత్రులు, పోలీస్ చెక్పోస్టుల్లో వలంటీర్లుగా పనిచేయాలని మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. "కిల్ కరోనా" కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
మాస్కు లేకపోతే ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా మారాల్సిందే!
"బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా, నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానా విధిస్తారు. దీనితో పాటు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, క్లినిక్స్, పోలీస్ చెక్పోస్టుల్లో మూడు రోజుల పాటు పనిచేయాలి."
--- జిల్లా యంత్రాంగం ఆదేశాలు.