తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీరుపై సర్కారు పార్లమెంటులో బదులివ్వాలి' - కేంద్రం

జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా భేటీ అయ్యారు. అమర్‌నాథ్‌ యాత్రికులను అర్ధంతరంగా ఎందుకు వెళ్లిపొమ్మన్నారో సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకాగానే  కేంద్రం ప్రకటన  చేయాలని డిమాండ్‌ చేశారు.

'కశ్మీరుపై సర్కారు పార్లమెంటులో బదులివ్వాలి'

By

Published : Aug 3, 2019, 3:29 PM IST

కశ్మీరులో తాజా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సోమవారం ప్రకటన చేయాలని డిమాండ్​ చేశారు నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఒమర్​ అబ్దుల్లా. అమర్​నాథ్​ యాత్ర రద్దు, పర్యటకుల తరలింపు, బలగాల మోహరింపు లాంటి పరిణామాలు ఒకేసారి ఎందుకు చోటుచేసుకుంటున్నాయో వివరించాలన్నారు.

కశ్మీరులో నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకు రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​తో శ్రీనగర్​లో ఒమర్​ భేటీ అయ్యారు. 370, 35ఏ అధికరణల తొలగింపు లాంటి చర్యలు ఉండబోవని గవర్నర్​ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కశ్మీరుపై సర్కారు పార్లమెంటులో బదులివ్వాలి: ఒమర్​ అబ్దుల్లా

"కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యాత్రికులను వెనక్కు పంపారు, పర్యటకులను హోటళ్ల నుంచి వెళ్లిపోమన్నారు. ఇవన్నీ చూశాక.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గవర్నర్​తో భేటీ అయ్యా. ఈ అనుమానాలపై గవర్నర్​ సమాధానమిచ్చారు.

35ఏ అధికరణ తొలగింపు లాంటి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. అందుకే మేం డిమాండ్​ చేస్తున్నాం.. పార్లమెంటులో ప్రభుత్వం సమాధానమివ్వాలి. కశ్మీరుపై వారి యోచన ఏంటి? తాజా పరిస్థితిపై వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? కశ్మీరు ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పార్లమెంటులో ప్రకటన చేయాలి."
- ఒమర్​ అబ్దుల్లా, నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details