కేరళ త్రిస్సూర్‌లోని ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటం వల్ల గురువాయూర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు దర్శనాలను నిలిపివేసినట్లు బోర్డు ప్రకటించింది. అయితే వర్చువల్ క్యూ విధానం ద్వారా పరిమిత సంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని తెలిపింది. ఆలయంలో రోజూవారి పూజలు, అభిషేకాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గురువాయూర్ ఆలయ దర్శనం నిలిపివేత - గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం మూసివేత
కేరళ త్రిస్సూర్‌లోని ప్రముఖ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనాలను రెండు వారాలపాటు నిలిపివేసినట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇటీవల ఆలయ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే..వర్చువల్ క్యూ విధానం ద్వారా పరిమిత సంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని పేర్కొంది.
'గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనాలు నిలిపివేత'
కేరళలో ఆదివారం మరో 4,698 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 59,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి
ఇదీ చదవండి :కరోనాకు తోడైన కల్తీ.. ప్రమాదకరంగా ఆహారం