ఆర్టికల్ 370 పేరుతో జమ్ముకశ్మీర్‌లోని అమాయకులను గుప్కర్ కూటమి సభ్యులు మోసం చేశారని ఆరోపించారు భాజపా జాతీయ ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి షానవాజ్ హుస్సేన్. ఆర్టికల్ 370ని ఉపయోగించుకుని నేతలు ధనికులయ్యారని విమర్శించారు. స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించి.. తమ బిడ్డలను మాత్రం ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించారని మండిపడ్డారు.
"ఇక్కడ ఎవరైనా చనిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడి యువత చేతిలో తుపాకుల బదులు కలాన్ని చూడాలని భాజపా భావిస్తోంది. కానీ.. వేర్పాటువాదులైన కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ నేతలు యువత చేతిలో తుపాకులు చూడాలనుకుంటున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది ఈ గుప్కర్ కూటమే."