తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంక్ వ్యాన్​ లూటీ- ఉగ్రవాదుల పనే! - Terrorists on Bank in JK

కశ్మీర్​లో బ్యాంకు వ్యానును కొందరు సాయుధ దుండగులు లూటీ చేశారు. వాహనంపై దాడిచేసి.. రూ. 60 లక్షలు దోచుకుని పరారయ్యారు.

Gun man looted Jammu and Kashmir Bank in Shopian district of South Kashmir abd debunked with 6o lakh Rupees
కశ్మీర్​ బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి- రూ.60లక్షలు లూటీ

By

Published : Nov 5, 2020, 12:48 PM IST

దక్షిణ కశ్మీర్​ షోపియాన్​లో కొందరు సాయుధ దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. జె అండ్​ కె​ బ్యాంక్​​కు చెందిన వాహనంపై తుపాకులతో దాడిచేసి.. తలుపులు బద్దలు కొట్టారు. అందులోని సొమ్ముతో ఉడాయించారు.


దోపిడీ సమయానికి వ్యానులో సుమారు రూ. 60 నుంచి రూ. 80లక్షల నగదు ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గతంలో ఉగ్రవాదులు ఇదే తరహాలో బ్యాంకులపై దాడులు చేసి, నగదు దోచుకెళ్లారు. ఇది కూడా వారి పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:కశ్మీర్​: 30 ఏళ్లలో 5 వేలకు పైగా రాజకీయ హత్యలు

ABOUT THE AUTHOR

...view details