తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో భారీ వర్షాలు- నలుగురు మృతి - వర్షాలు

గుజరాత్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదరాలో వర్షం కారణంగా నలుగురు మృతి చెందారు. వీధులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గుజరాత్​లో భారీ వర్షాలు- నలుగురు మృతి

By

Published : Aug 1, 2019, 11:00 AM IST

గుజరాత్​లో భారీ వర్షాలు- నలుగురు మృతి

గుజరాత్​లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వడోదరా నగర వీధులన్నీ జలమయమయ్యాయి. వర్ష బీభత్సం కారణంగా నలుగురు మృతి చెందారు. నడుము లోతుకు పైగా ప్రవహిస్తున్న వరద నీరు సముద్రాన్ని తలపిస్తోంది. వడోదరాలో నిన్న రాత్రి నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.

సీఎం రూపానీ సమీక్ష

వడోదరా సహా రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలపై ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. వడోదరా చుట్టుపక్కల ఉన్న 13 లోతట్టు గ్రామాల్లో నివసిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అప్రమత్తంగా సహాయక బృందాలు

సహాయక చర్యల కోసం ఎస్​ఆర్​పీ, ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను మోహరించారు. ప్రస్తుతం వర్షం ఆగిపోయినప్పటికీ మళ్లీ వర్షం కురిస్తే విశ్వామిత్రి నదిలో వరద ప్రవాహం పెరగవచ్చన్న అంచనాలతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. వరదల కారణంగా వడోదరాలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఉత్తర గుజరాత్​లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఇదీ చూడండి: ముమ్మారు తలాక్​ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details