ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్ ఆరోపణలపై గుజరాత్ ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనపై విచారించాల్సిందిగా అహ్మదాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓపెన్ టాప్ జీప్లో వచ్చారు మోదీ. ఆయన వాహనానికి ప్రజలు ఇరువైపులా నిల్చున్నారు. ఓటు వేసిన అనంతరం కొద్ది దూరం నడిచి మీడియాతో మాట్లాడారు.
మోదీ రోడ్ షోపై ఎన్నికల సంఘం విచారణ - నరేంద్రమోదీ
గుజరాత్ అహ్మదాబాద్లో మంగళవారం ఓటు వేసిన అనంతరం ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఎన్నికల నియమావళిని మోదీ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు.
మోదీ రోడ్ షోపై ఎన్నికల సంఘం విచారణ
ఈ విషయమై ఈసీని ఆశ్రయించింది కాంగ్రెస్. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెండు నుంచి మూడు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరింది. భాజపా అధ్యక్షుడు అమిత్షా ఎన్నికల ఉల్లంఘనల్ని సైతం కాంగ్రెస్ ఎత్తిచూపింది. ఆయనను 72 గంటలపాటు ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదీ చూడండి: 'ఇద్దరు నేతల రాజకీయ వైరమే పేలుళ్లకు చోటిచ్చింది!'