గుజరాత్ జానపద గాయకురాలు గీత రబారీ దిల్లీలో నేడు ప్రధాని నరేంద్రమోదీని కలిసింది. పార్లమెంటులో మోదీ ఆమెతో సమావేశమై కాసేపు ముచ్చటించారు. ప్రధాని ముందు ఓ పాట పాడి వినిపించింది గీత. పాఠశాలలో ఉన్నప్పుడు మోదీ ఎదుట పాట పాడానని, ఆయన రూ. 250 బహుమతిగా ఇచ్చి ఇలాగే సాధన చేయమని ప్రోత్సహించారని తెలిపింది.
ప్రధాని మోదీని మెప్పించిన గుజరాతీ గాయని
పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీని కలిసింది గుజరాతీ గాయని గీత రబారీ. మోదీ ముందు పాట పాడి వినిపించింది. పాఠశాలలో ఉన్నప్పుడు ప్రధానిని తొలిసారి కలిశానని గుర్తుచేసుకుంది.
గీత రబారీ
"నా చిన్నతనంలో మోదీని తొలిసారి కలిశాను. అప్పుడు స్కూల్లో ఉన్నాను. ఆయన ముందు పాట పాడి వినిపించినందుకు రూ. 250 బహుమతిగా ఇచ్చారు. ఇలాగే పాడుతూ సాధన చేయమని ప్రోత్సహించారు. మాల్ధారీ తెగకు చెందిన మా కుటుంబం అటవీ ప్రాంతంలో నివసిస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో నుంచి మా నాన్నాకు ఓ పోస్ట్ కార్డు అందింది. అప్పటి నుంచి నాన్న నన్ను పాఠశాలకు పంపించడం మొదలుపెట్టారు."
-గీత రబారీ, గుజరాతీ జానపద గాయకురాలు
ఇది చదవండి: కర్'నాటకం'లో మా పాత్ర లేదు: రాజ్నాథ్