కరోనా విజృంభిస్తున్న వేళ ఓ ఘరానా దొంగ... పకడ్బందీగా దొంగతనానికి పాల్పడ్డాడు. పీపీఈ సూట్ ధరించి మరీ గుజరాత్ రాజ్‌కోట్‌లో... మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్లో ప్రవేశించాడు. అక్కడ ఉన్న హుండీ నుంచి సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు అపహరించాడు. ఈ మొత్తం ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. డేరాసర్ నిర్వహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఘరానా దొంగ.. పీపీఈ సూట్ ధరించి మరీ చోరీ - ఘరానా దొంగ పీపీఈ సూట్ ధరించి మరీ చోరీ!
గుజరాత్ రాజ్‌కోట్‌లో ఓ ఘరానా దొంగ పీపీఈ సూట్ ధరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ముందు జాగ్రత్త తీసుకున్నాడు. మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్లో ప్రవేశించి... సుమారు రూ.40 వేలు వరకు దొంగింలించాడు.
![ఘరానా దొంగ.. పీపీఈ సూట్ ధరించి మరీ చోరీ Gujarat: Thieves wearing PPE suits break in temple, caught on CCTV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8186283-thumbnail-3x2-ppe.jpg)
ఘరానా దొంగ.. పీపీఈ సూట్ ధరించి మరీ చోరీ!