తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలెక్కిన అహ్మదాబాద్​- ముంబయి తేజస్​ రైలు - గుజరాత్​ వార్తలు

అహ్మదాబాద్​-ముంబయి మార్గంలో తేజస్​ రైలును రైల్వే మంత్రి పీయూష్​​ గోయల్​ జెండా ఊపి ప్రారంభించారు. లఖ్​నవూ-దిల్లీ మధ్య ప్రస్తుతం నడుస్తున్న తేజస్​ ప్రైవేట్​ ఎక్స్​ప్రెస్​ విజయవంతమైన క్రమంలో.. ఈ రైలును పట్టాలెక్కించింది ఐఆర్​సీటీసీ. జనవరి 19 నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగనున్నాయి.

తేజస్​ రైలు
తేజస్​ రైలు

By

Published : Jan 17, 2020, 11:19 AM IST

దేశంలో మరో ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. అహ్మదాబాద్- ముంబయి మార్గంలో తేజస్‌ రైలును రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ గుజరాత్​లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు.

దేశంలో తొలి ప్రైవేట్ రైలుగా లఖ్​నవూ-దిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ -ముంబయి రూట్​లో రెండో తేజస్ రైలు తీసుకొచ్చారు.

పట్టాలెక్కిన అహ్మదాబాద్​-ముంబయి తేజస్​ రైలు

ఈ రైలు బుకింగ్స్​ను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. రాకపోకలు ఈ నెల 19న పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​తో పాటు మొబైల్ యాప్ రైల్ కనెక్ట్ ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details