తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​ - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేడావాలా

ఇటీవల గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరు కావటం వల్ల రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Gujarat Congress MLA Tests COVID-19 Positive Hours After Meeting Chief Minister
సీఎం భేటీకి హజరైన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​

By

Published : Apr 15, 2020, 7:16 AM IST

Updated : Apr 15, 2020, 7:28 AM IST

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీని కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అవడం కలకలం రేపింది. అహ్మదాబాద్‌లోని ఖాడియా-జమాల్‌పుర్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేడావాలా.. మంగళవారం ఉదయం రూపానీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి పలువురు శాసనసభ్యులతో కలిసి హాజరయ్యారు.

ఈ క్రమంలో ఖేడావాలా కొవిడ్‌ బారిన పడ్డట్లు ఆ రోజు సాయంత్రమే నిర్ధరణ అయింది. సీఎం నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, మరికొంత మంది మంత్రులు కూడా పాల్గొనడం వల్ల అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : Apr 15, 2020, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details