గుజరాత్ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది మోహరింపునకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. తొలిదశలో భాగంగా ఈ నెల 25 నుంచి 272 మందిని అక్కడ మోహరించనున్నారు. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్ పంపిన లేఖకు సమాధానమిచ్చింది కేంద్రం.
ఐక్యతా విగ్రహానికి రక్షణగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది - గుజరాత్
కరోనా విజృంభణ నేపథ్యంలో కొద్ది నెలలుగా మూతపడిన ఐక్యతా విగ్రహ సందర్శన త్వరలోనే పునఃప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నెల 25 నుంచి అక్కడ 272మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
ఐక్యతా విగ్రహానికి రక్షణగా 272మంది సీఎస్ఐఎఫ్ సిబ్బంది
కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలలుగా ఐక్యతా విగ్రహ సందర్శనను నిలిపివేసింది ప్రభుత్వం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 2 నుంచి సందర్శకులను అనుమతించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.