తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2019, 6:57 PM IST

Updated : Oct 7, 2019, 2:54 PM IST

ETV Bharat / bharat

ఆన్​లైన్​ గేమ్​ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య

ఆన్​లైన్ గేమ్స్ మనుషుల పాలిట యమగండాలుగా మారుతున్నాయి. ఒకవైపు బ్లూ వేల్ గేమ్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని బలిగొంటుంటే ఆన్​లైన్ పోకర్, రమ్మీ​​ వంటివి మరికొందరి చావుకు కారణమవుతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఆన్​లైన్ పోకర్​కు బానిసై, లక్షల్లో అప్పులపాలై ఓ ఐటీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఐటి ఉద్యోగి ఉసురు తీసిన ఆన్​లైన్​ పోకర్​

ఆన్​లైన్​ గేమ్​ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య

ఆన్​లైన్​ పోకర్​ గేమ్​... గుజరాత్​లో ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైంది. ఈ ఘటన రాజ్​కోట్​ జిల్లా మోటా మార్వా ప్రాంతంలో బుధవారం ​ రాత్రి జరిగింది. మరుసటి రోజు ఉదయం నీటిలో మృతదేహం తేలగా విషయం వెలుగులోకి వచ్చింది.

మృతుడు కృనాల్​ మెహతా(39) ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఆరా తీస్తే... నివ్వెరపరిచే సంగతి తెలిసింది. కృనాల్​కు ఆన్​లైన్​ పోకర్​ గేమ్​ ఆడటం అలవాటైంది. ఇందుకు అవసరమైన డబ్బును స్నేహితులు, బంధువులు దగ్గర అప్పు చేసేవాడు. ఇలా మొత్తంగా రూ.78లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

"కృనాల్​ ఇంటి నుంచి ఓ లేఖ స్వాధీనం చేసుకున్నాం. 'పోకర్​బాజీ' ఆడేందుకు మిత్రులు, బంధువుల నుంచి రూ.78లక్షలు అప్పు చేసినట్లు ఆ లేఖలో కృనాల్ పేర్కొన్నాడు.
మొబైల్​ గేమింగ్​ యాప్​లో కృనాల్​ తన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాడు. అతడి మృతి తర్వాత కృనాల్ సోదరుడికి బ్యాంకు లావాదేవీ వివరాలతో ఒక మెయిల్ వచ్చింది. వరుస గేముల్లో కృనాల్​ ఎంతెంత సొమ్ము పోగొట్టుకున్నాడో అందులో ఉంది."

-విక్రమ్​ వంజారా, పోలీస్​ అధికారి

కృనాల్​ ఆత్మహత్యపై సైబర్​ సెల్​ పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : అనాథల కథ: భర్తకు తలకొరివి పెట్టిన భార్య

Last Updated : Oct 7, 2019, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details