ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర తర్వాత ఆ స్థాయిలో గుజరాత్ అహ్మదాబాద్ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్ జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ వాదనలు సహా పూరీ రథయాత్రపై సుప్రీం కోర్టు స్టేను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయామూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రథయాత్రకు సంబంధించిన అన్నిరకాల మతపరమైన, సెక్యులర్ కార్యక్రమాలపై స్టే విధించింది.