కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగోలేదంటూ సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేసిన నలుగురిని అరెస్టు చేశారు గుజరాత్ పోలీసులు. అహ్మదాబాద్ భావ్నగర్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఐటీ చట్టంలోని 66(సీ), 66(డీ) సెక్షన్ల కింద నలుగురిపైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అమిత్ షా పేరున నకిలీ ట్విట్టర్ ఖాతాను క్రియేట్ చేసి.. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ.. నిందితులు పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ మారింది.
తన ఆరోగ్యంపై వస్తున్న నకిలీ వార్తలకు అమిత్ షా సైతం.. స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఇంటివద్దనే సీబీఎస్ఈ 10, 12 తరగతుల మూల్యాంకనం