తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో 28 కొత్త కేసులు.. దేశవ్యాప్తంగా 9 మంది మృతి - కేరళలో 28 కొత్త కేసులు.

దేశంలో కరోనా ​స్వైరవిహారం చేస్తోంది. వైరస్​ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 468కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే కేరళలో 28 మంది వైరస్ బారిన పడినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దేశం మొత్తంలో 9 మంది మరణించారు.

Guj:COVID-19 cases rise to 30, CM urges people to stay indoors
కేరళలో 28 కొత్త కేసులు.. మహారాష్ట్రలో విజృంభన

By

Published : Mar 23, 2020, 9:23 PM IST

Updated : Mar 24, 2020, 12:35 AM IST

మానవాళికే పెను ముప్పుగా మారిన కరోనా భారత్​లోనూ వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 468 మందికి వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో 40 విదేశీయులు.మొత్తం బాధితుల్లో 35 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రస్తుతం 424 యాక్టివ్​ కేసులున్నట్లు తెలిపారు.

ఇవాళ బంగాల్​, హిమాచల్​ ప్రదేశ్​లలో తొలి కరోనా మరణాలు సంభవించాయి. కొవిడ్​ ధాటికి మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్​, బిహార్​, కర్ణాటక, పంజాబ్​ల్లోనూ ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో ఒక్కరోజే 28మందికి..

కేరళలో వైరస్​ విజృంభిస్తోంది. సోమవారం మరో 28 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేసుల సంఖ్య 91కి చేరింది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 64 వేల మందికి పైగా వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపిన అధికారులు.. మరో 323 మందిని ఐసోలేషన్​ వార్డులకు తరలించినట్లు స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో 23..

మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 23 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 97కి చేరింది.

గుజరాత్​లో..

గుజరాత్​లోను​ క్రమంగా కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. తాజాగా 12 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 30 మందికి మహమ్మారి సోకినట్లయింది.

ఉత్తరాఖండ్​లో...

ఉత్తరాఖండ్​లో మరో కరోనా కేసు నమోదైనట్లు రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో వైరస్​ బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి...

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నమోదైన మొత్తం కేసులు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 33, రాజస్థాన్​లో 32 (ఇద్దరు విదేశీయులు), ఉత్తర ప్రదేశ్​లో 33 (ఒక విదేశీయుడు), దిల్లీలో 29, హరియాణాలో 26( 14 మంది విదేశీయులతో), పంజాబ్​లో 21, లద్దాఖ్​లో 13, తమిళనాడులో 9, బంగాల్​లో 7, మధ్యప్రదేశ్​లో 6, చండీగఢ్​​లో 6, ఆంధ్రప్రదేశ్​లో 7, జమ్ముకశ్మీర్​లో 4, బిహార్​, ఒడిశా, హిమాచల్​ ప్రదేశ్​ల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి, ఛత్తీస్​గఢ్​లో ఒక్కొక్కరు చొప్పున వైరస్​ బారిన పడినట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.

ఇదీ చూడండి:'లాక్​డౌన్​'ను ఉల్లంఘిస్తే 6 నెలలు జైల్లో గడపాల్సిందే!

Last Updated : Mar 24, 2020, 12:35 AM IST

ABOUT THE AUTHOR

...view details