తెలంగాణ పోలీసు సంక్షేమ నిధికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు గుజరాత్ భావ్‌నగర్‌కు చెందిన వ్యాపారి రాజ్భా గోహిల్. దిశ కేసులోని నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు గానూ ఈ విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు.
'దిశ' ఎన్కౌంటర్ పోలీసులకు లక్ష రూపాయల విరాళం! - donations to telanagana police for disha encounter
దిశ హత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు.. తెలంగాణ పోలీసులకు దేశ నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి. ఓ పశువైద్యురాలి పట్ల మృగాళ్లలా వ్యవహరించిన వారిని హతమార్చి గొప్ప పని చేశారని కొనియాడుతున్నారు. ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేసిన గుజరాత్‌లోని ఓ వ్యాపారి తెలంగాణ పోలీసులకు లక్ష రూపాయల విరాళాన్ని ఇస్తానని ప్రకటించాడు.

'దిశ' ఎన్కౌంటర్ పోలీసులకు లక్ష రూపాయల విరాళం!
'దిశ' ఎన్కౌంటర్ పోలీసులకు లక్ష రూపాయల విరాళం!
"ఈ రోజు నేను భారత సర్కారు, భారతీయ పోలీసులను చూసి చాలా గర్వపడుతున్నాను. నా భారతీయ సోదరికి న్యాయం జరిగింది. దిశ నిందితులను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ ఎన్‌కౌంటర్‌ను నేను గౌరవిస్తాను. అందుకే తెలంగాణ పోలీసు సంక్షేమ నిధికి లక్ష రూపాయలు జమ చేస్తాను. హైదరాబాద్‌కు వెళ్లి నేనే స్వయంగా ఆ డబ్బు ఇస్తాను. పోలీసులకు సలాం చేస్తాను."
-రాజ్భా గోహిల్, వ్యాపారి.
ఇదీ చదవండి:అత్యాచార కేసు దోషులు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి