తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా అధ్యక్షుడికి 'నమస్తే ట్రంప్​' పలకరింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఈ నెల 24న గుజరాత్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో 'నమస్తే ట్రంప్​' పోస్టర్లను విడుదల చేసింది అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​.

Guj: AMC tweets ''Namaste Trump'' posters ahead of Feb 24 visit
అమెరికా అధ్యక్షుడితో 'నమస్తే ట్రంప్​..'

By

Published : Feb 17, 2020, 5:48 AM IST

Updated : Mar 1, 2020, 2:11 PM IST

అమెరికా అధ్యక్షుడికి 'నమస్తే ట్రంప్​' పలకరింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రాక కోసం యావత్​ భారతదేశం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. ఈ నెల 24న జరగబోయే కార్యక్రమాల కోసం​ శరవేగంగా ముస్తాబవుతోంది. తాజాగా ట్రంప్​ పాల్గొనే కార్యక్రమాలపై అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(ఏఎమ్​సీ).. 'నమస్తే ట్రంప్​' పోస్టర్లతో పలు వివరాలను ట్వీట్​ చేసింది.

పాన్​-ఇండియా ఇమేజ్​ కోసం...

24వ తేదీన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం.. ప్రధాని మోదీతో కలిసి చారిత్రక రోడ్​షోలో పాల్గొంటారు ట్రంప్​. ఈ రోడ్​ షో 22 కిలోమీటర్లు సాగనుంది. ఆ తర్వాత ఇరు నేతలు మొతేరాలోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడే జరగనున్న భారీ బహిరంగ సభలో అగ్రనేతలు ప్రసంగించనున్నారు. ఈ సభలో దాదాపు లక్షమంది ప్రజలు పాల్గొంటారని అధికారులు అంచనావేస్తున్నారు.

తొలుత ఈ కార్యక్రమానికి.. గుజరాతీ భాషలో 'కెమ్​ చ్ఛో ట్రంప్​' అనే పేరు పెడతారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ వేడుకకు పాన్​-ఇండియా ఇమేజ్​ తీసుకురావడం కోసం 'నమస్తే ట్రంప్​'ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్​లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమాన్ని ఇది గుర్తుచేస్తోంది.

Last Updated : Mar 1, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details