తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హ్యూమన్​ కంప్యూటర్​ 'శకుంతలా దేవి'కి మరో గౌరవం

అంకెలు నేర్వాల్సిన ఆరేళ్ల ప్రాయంలోనే.. ఏకంగా విశ్వవిద్యాలయంలోనే గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. యాభై ఏళ్ల వయసులో కంప్యూటర్​ కంటే వేగంగా అంకెలను గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి.. గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించారామె. అలా తన ప్రతిభతో గణిత మేధావిగా, హ్యూమన్​ కంప్యూటర్​గా సుపరిచితురాలైన శకుంతాలా దేవికి మరో అరుదైన గౌరవం దక్కింది.

Guinness World Records awards certificate to Shakuntala Devi for 'fastest human computation'
హ్యూమన్​ కంప్యూటర్​ శకుంతల దేవికి మరో గౌరవం

By

Published : Jul 31, 2020, 7:13 AM IST

మానవ కంప్యూటర్​గా ఖ్యాతి గడించిన భారతీయ గణిత మేధావి దివంగత శకుంతలా దేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల 'ఫాస్టెస్ట్​ హ్యూమన్​ కంప్యూటేషన్'గా ఆమెను సత్కరించింది గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు శకుంతలా దేవి కుమార్తె అనుపమ బెనర్జీ.

1980 జూన్​ 18న లండన్​లోని ఇంపీరియల్​ కళాశాలలో శకుంతలా దేవి ఇచ్చిన అద్భుత ప్రదర్శనే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. అదే రోజే ఆమె ప్రపంచానికి హ్యూమన్​ కంప్యూటర్​గా పరిచయమయ్యారు. 13 అంకెలు కలిగిన వివిధ సంఖ్యలను గుణంచి కేవలం 28 సెకండ్లలో సమాధానమిచ్చారు శకుంతలా దేవి.

హ్యూమన్​ కంప్యూటర్​ శకుంతలా దేవి

వెండి తెరపై..

శకుంతలా దేవి మరణించిన ఏడేళ్ల తర్వాత వెండితెరపై ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తోంది. ఆమె పాత్రలో ప్రముఖ నటి విద్యాబాలన్​ కనిపించనున్నారు. 'శకుంతలా దేవి' పేరుతో అను మేనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విక్రమ్​ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ కూడా విడుదలవ్వగా.. ఇందులో బాల్యం నుంచి ఆమె ఎదిగిన క్రమాన్ని ఆవిష్కరించారు. శకుంతలాదేవి కుమార్తె(అనుపమ బెనర్జీ) పాత్రలో బాలీవుడ్‌ నాయిక సన్యా మల్హోత్ర కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జులై 31న(శుక్రవారం) విడుదల కానుంది.

ఇదీ చదవండి:'ఆవు పేడ రాఖీ'లతో స్వదేశీ రక్షా బంధన్!

ABOUT THE AUTHOR

...view details