కేరళలో వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉపాధి కోల్పోయిన చాలా మందికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించినా.. వసతులు, భోజనం సరిగా లేవని ఆరోపిస్తున్నారు. కన్నూరు జిల్లాలో సుమారు వంద మంది కూలీలు నడక దారిన వేల కిలోమీటర్లు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు.
వస్తువులతో పాటు నీళ్ల డబ్బాలను మోసుకుంటూ రైలు పట్టాల వెంబడి బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు.. మహా పాదయాత్ర ప్రారంభించారు. అయితే వీరిని రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది అడ్డుకొని ప్రభుత్వ క్యాంపులకు తరలించారు. వారిని బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. కోజికోడ్‌లోని కుట్టియాడిలో బిహార్‌కు చెందిన కొంత మంది కూలీలు.. తమ రాష్ట్రాలకు పంపాలని పోలీసులపైకి రాళ్లు విసిరారు. దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
"మేం మా ఇళ్లకు వెళ్లానుకుంటున్నాం. రోజుకు ఒకసారి భోజనం అందిస్తున్నారు. మా వద్ద డబ్బు లేదు. ఇక్కడ పని లేదు. ఇళ్లకు వెళ్లటం తప్ప మాకు మరో మార్గం లేదు."