తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2020, 1:47 PM IST

ETV Bharat / bharat

దిల్లీలో బయటపడ్డ నకిలీ జీఎస్టీ బిల్లుల రాకెట్​

దిల్లీలో నకిలీ బిల్లుల భారీ రాకెట్​ను బట్టబయలు చేశారు జీఎస్టీ అధికారులు. 23 షెల్​ కంపెనీల సాయంతో రూ.7,896 కోట్ల విలువైన నకిలీ ఇన్​వాయిస్​లను సృష్టించినట్లు గుర్తించారు.

BIZ-GST-FAKE INVOICE
జీఎస్టీ

దిల్లీలో రూ.7,896 కోట్ల విలువైన నకిలీ బిల్లుల రాకెట్​ను భగ్నం చేశారు జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం అధికారులు. ఇందుకు సంబంధించి 23 షెల్​ కంపెనీలను గుర్తించారు. వీటి ద్వారా మోసపూరితంగా రూ.1,709 కోట్ల ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ (ఐటీసీ) పొందినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్​ చేశారు. వీరిని 14 జ్యుడిషీయల్​ కస్టడీలోకి తీసుకున్నారు అధికారులు. ఈ కంపెనీలు ఎలాంటి వస్తువుల రవాణా లేకున్నా బిల్లులను సృష్టించి ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ను పొందాయి. ఇలా మోసపూరితంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు నిందితులు.

ABOUT THE AUTHOR

...view details