ఉత్తర్ప్రదేశ్ సోన్భద్రా జిల్లాలో 3,000 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయనే వార్త నిజం కాదని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించింది. తాము అలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. సోన్భద్రా జిల్లాలో భారీ మొత్తంలో బంగారు నిల్వలు ఉన్నట్లు నిర్ధరణ కాలేదని తెలిపింది.
'3000టన్నులు కాదు 160కిలోల బంగారమే ఉంది' - sonbhadra gold reserves latest news
ఉత్తర్ప్రదేశ్లో 3000 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖండించింది. అక్కడ 52వేల 800 టన్నుల ముడి ఖనిజం ఉందని వివరణ ఇచ్చింది. దీని ద్వారా 160కిలోల బంగారం మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది.
'3000టన్నులు కాదు 160కిలోల బంగారమే ఉంది'
బంగారు నిల్వల కోసం తాము జరిపిన సర్వే అంత సంతృప్తికరంగా లేదని జీఎస్ఐ డైరెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఆ ప్రాంతంలో 52వేల 8వందల టన్నుల ముడిఖనిజం ఉందని.. అయితే దాని నుంచి ప్రతీ టన్నుకు 3.03 గ్రాముల బంగారం వెలువడుతుందన్నారు. మొత్తంగా అక్కడున్న ఖనిజం నుంచి 160కిలోల బంగారం మాత్రమే వస్తుందన్నారు. మీడియాలో పేర్కొన్నట్లు 3000 టన్నులు కాదని వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: బంగారు గని: యూపీలో 3,000 మెట్రిక్ టన్నుల నిక్షేపాలు
Last Updated : Mar 2, 2020, 6:17 AM IST