తమిళనాడులోని కోయంబత్తూర్‌లో.. 'కోవై ట్రాన్స్ కిచెన్' పేరుతో హోటల్ తెరిచింది ఓ ట్రాన్స్జెండర్ల బృందం. ఎన్నో రుచికరమైన వంటలను అందిస్తోంది.
నోరూరించే ఆహారానికి అడ్డా ఈ 'కోవై ట్రాన్స్ కిచెన్' తమ లాంటి వారు యాచించడం మాని.. సొంత కాళ్ల మీద నిలబడటం అలవాటు చేసుకోవాలని అన్నారు కోయంబత్తూర్ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ చీఫ్ సంగీత. ఇదే తరహాలో మరో తినుబండారాల విక్రయ కేంద్రం తెరవనున్నట్టు తెలిపారు.
ఈ హోటల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
"నేను సాధారణంగా దక్షిణ భారతంలో పర్యటిస్తూ ఉంటాను. అప్పుడే ఈ హోటల్ గురించి తెలిసింది. నేను భోజన ప్రియుడిని. రుచికరమైన ఆహారాన్ని అందించడం సహా ట్రాన్స్జెండర్లకు వీరు ఉద్యోగాన్ని ఇస్తున్నారు. ఇది ఎంతో మంచి విషయం."
--- కోయంబత్తూర్ వాసి.
హోటల్‌ను నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లను సామాజిక కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడ్డ వారికి ఇది మంచి ప్రారంభమని అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి:-ట్రాన్స్జెండర్ల సమానత్వం కోసం జాతీయ మండలి