తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రుల బృందం భేటీలో అణు విధానంపైనే చర్చ!

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నివాసంలో మంత్రుల బృందం భేటీ అయ్యింది. కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అణ్వస్త్రాల వినియోగం భవిష్యత్తు పరిణామాలపై ఆధారపడి ఉంటుందని రాజ్​నాథ్ సింగ్​​ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంత్రుల బృందం భేటీలో అణు విధానంపైనే చర్చ!

By

Published : Aug 17, 2019, 4:21 PM IST

Updated : Sep 27, 2019, 7:25 AM IST

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అధికారిక నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ల బృందం భేటీ అయింది.

శుక్రవారం పోఖ్రాన్​ సందర్శనలో భాగంగా.. అణ్వస్త్రాల వినియోగం అనేది భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. అణ్వస్త్రాలు మొదట ప్రయోగించరాదన్నది ప్రస్తుతం దేశ విధానంగా ఉందని తెలిపారు.

అణ్వస్త్రాల వినియోగంపై రాజ్​నాథ్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే మంత్రుల బృందం భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో అణ్వాయుధాలపై కీలక చర్చ జరిగిందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

Last Updated : Sep 27, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details