తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐటీబీపీ ఆధ్వర్యంలో 10 వేల పడకల కొవిడ్ కేంద్రం

దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు 10వేల పడకలతో ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ముందుగా 2వేల పడకలతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సౌకర్యాలపై ప్రత్యేక కథనం.

Ground report from Delhi's largest COVID-19 facility
దిల్లీలో 10వేల పడకలతో కొవిడ్​-19 సంరక్షణ కేంద్రం

By

Published : Jun 25, 2020, 2:40 PM IST

దేశ రాజధాని దిల్లీలో నానాటికీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు వైద్యం అందించేందుకు 10వేల పడకలతో అతిపెద్ద కొవిడ్​-19 సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 2వేల పడకలతో రోగులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్​ 26 (శుక్రవారం) ప్రారంభించనున్నారు.

దక్షిణ దిల్లీ చత్తర్​పుర్​ ప్రాంతంలో రాధాసోమి బియాస్​ కేంద్రంలో కరోనా చికిత్స కోసం చేస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలపై ఈటీవీ భారత్​ గ్రౌండ్​ రిపోర్ట్​.

  • ఇప్పటికే సంరక్షణ కేంద్రంలో పదుల సంఖ్యలో పడకలను ఏర్పాటు చేశారు. ఒక్కోపడక వద్ద ఒక కుర్చీ, చెత్తబుట్ట, సబ్బు, తాగు నీరు అందుబాటులో ఉంచారు.
  • పడకల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూశారు. బాధితుల సౌకర్యార్థం సీలింగ్​ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
  • ప్రస్తుతం ఏసీల బిగింపు, ఫ్లోరింగ్​ పనులు సాగుతున్నాయి.
  • జూన్​ 26న తొలుత 2000 పడకలతో ప్రారంభించనున్నారు. జూన్​ 27 నుంచి కరోనా బాధితులను అనుమతించనున్నారు. దశల వారీగా పడకలను పెంచుతూ.. జులై మొదటి వారానికి పూర్తిస్థాయిలో 10వేల పడకలను అందుబాటులోకి తేనున్నారు.
  • తొలుత కేటాయించే 2వేల పడకలను ఐటీబీపీ వైద్యులు, పారమెడికల్​ సిబ్బంది, నర్సులతో నిర్వహించనున్నారు. వారికి అవసరమైన సౌకర్యాలు, సామగ్రిని ప్రభుత్వం కల్పించనుంది.

ఇదీ చూడండి: 'రాకెట్ల తయారీలో ప్రైవేటు సంస్థలకు అనుమతి'

ABOUT THE AUTHOR

...view details