తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫస్ట్​ నైట్​కు కరోనా బ్రేక్- క్వారంటైన్​కు వరుడు - lockdown marriage news

లాక్​డౌన్​ సమయంలో ఎంతో కష్టపడి వివాహం చేసుకున్న ఓ జంటకు వింత అనుభవం ఎదురైంది. కొత్త జీవితంలోకి అడుగిడి.. ఫస్ట్​నైట్​కు సిద్ధమవుతున్న వారికి కరోనా రూపంలో అడ్డంకి ఎదురైంది. తొలిరేయి ఆశలపై నీళ్లు చల్లింది. అసలు ఏం జరిగింది?

marriage
ఫస్ట్​ నైట్​ను అడ్డుకున్న కరోనా

By

Published : May 3, 2020, 3:13 PM IST

కరోనా వైరస్​ కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడ్డాయి. లాక్​డౌన్​లోనూ కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కర్ణాటక ఉడుపి జిల్లాలో వివాహం చేసుకున్న నవదంపతులకు వింత అనుభవం ఎదురైంది. పెళ్లి తంతు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి.. తొలిరాత్రికి సిద్ధమవుతున్న తరుణంలో కరోనా రూపంలో వారికి అడ్డంకి ఏర్పడింది.

అదే కారణం...

ఉడుపి జిల్లాలోని బోలా గ్రామానికి చెందిన యువకుడు తన పెళ్లి కోసం మంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చాడు. లాక్​డౌన్​ ఉన్నా ఎంతో కష్టపడి పెళ్లికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల కుత్యారు గ్రామంలోని వధువు ఇంట్లో వివాహం జరిగింది. పెళ్లి తంతు పూర్తి చేసుకుని భార్యతో ఇల్లు చేరాడు. రాత్రికే నవదంపతులకు తొలిరేయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. కరోనా వారి ఫస్ట్​నైట్​కు అడ్డు తగిలింది.

వేరే ఊరి నుంచి వచ్చారనే సమాచారంతో ఆరోగ్య శాఖ అధికారులు వరుడి ఇంటికి చేరుకున్నారు. అతడ్ని క్వారంటైన్​కు తరలించారు. ఇంకేముంది.. దంపతుల్లో తొలిరేయి ఆశలు ఆవిరైపోయాయి. 14 రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెళ్లికి హాజరైన ఎనిమిది మందిని హోమ్​ క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించారు అధికారులు. బోలా గ్రామానికి మొత్తం 18 మంది ఇతర నగరాల నుంచి రాగా వారందరినీ క్వారంటైన్​ చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details