ఏ పెళ్లిలోనైనా కట్నం దగ్గర కానీ, భోజనం విషయంలో కానీ పెళ్లికొడుకు ఆగ్రహించటం, అలగటం మనం చూస్తుంటాం. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మాత్రం ఓ సిల్లీ కారణంతో పెళ్లినుంచి పారిపోయాడు ఓ వరుడు. కారణమేంటి అనుకుంటున్నారా? వధువు తరఫున కుటుంబంవారు తాను చూపించిన చీర కొనలేదనే కారణంతో అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
పెళ్లి నుంచి పారిపోయిన వరుడు.. కారణమిదే! - latest escape from marriage
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ వరుడు చిన్న కారణంతో పెళ్లి వద్దని పారిపోయాడు. అది విన్న వధువు తరఫు కుటుంబం ముక్కున వేలేసుకుంది. ఇంతకీ ఆ కారణమేంటని అనుకుంటున్నారా? మీరే చదవండి.
పెళ్లి నుంచి పారిపోయిన వరుడు.. కారణమిదే!
బిదరెకేరె గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు.. అదే ఊరికి చెందిన ఓ అమ్మాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వివాహానికీ అంగీకరించాయి. పెళ్లి రోజు కూడా నిశ్చయించారు. అయితే చీర కోసం అలిగిన రఘు... పెళ్లిరోజు పారిపోయాడు. ప్రస్తుతం వధువు కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు.
Last Updated : Feb 29, 2020, 12:16 PM IST