రాజస్థాన్ భీల్వాడాలో కరోనా కలకలం రేపింది. భడదా భాగ్‌లో పెళ్లయిన వారానికే వరుడు సహా.. అతడి కుటుంబంలోని మరో 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పెళ్లింట్లో ఒకేసారి ఇంతమందికి వైరస్ సోకడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
అప్రమత్తమైన అధికారులు.. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.