ఉగ్రవాదులు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా ఆజాద్గంజ్ వద్ద భద్రతా బలగాలపై గ్రెనేడ్ దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.
కశ్మీర్లో గ్రెనేడ్ దాడి- ఆరుగురు పౌరులకు గాయాలు - Grenade attack in Baramulla
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారత సైన్యమే లక్ష్యంగా గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.
![కశ్మీర్లో గ్రెనేడ్ దాడి- ఆరుగురు పౌరులకు గాయాలు Grenade attack in J-K's Baramulla, six civilians injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8627941-thumbnail-3x2-granade.jpg)
జమ్ముకశ్మీర్లో గ్రనేడ్ దాడి- ఆరుగురు పౌరులకు గాయాలు
బారాముల్లా నుంచి శ్రీనగర్ వెళ్తున్న సైనిక వాహన శ్రేణిపై గ్రెనేడ్లు విసిరారు ముష్కరులు. అవి వాహనాలపై పడకపోవడం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే రోడ్డుపై వెళ్తున్న స్థానికులు గాయాలపాలయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:'మేం కన్నెర్ర చేశాం.. మీకు కన్నీరు ఎందుకు?'