తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జాదవ్​ తీర్పుతో న్యాయవాదిగా గర్విస్తున్నా' - లండన్

పాక్​ చెరలో ఉన్న కులభూషణ్​ జాదవ్​ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై  భారత్​ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే హర్షం వ్యక్తం చేశారు. పాక్​ కుట్రలను భగ్నం చేసి విజయం సాధించామని తెలిపారు.

న్యాయవాది హరీశ్ సాల్వే

By

Published : Jul 17, 2019, 10:47 PM IST

ది హేగ్​లోని అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ కేసులో ఇచ్చిన తీర్పుపై భారత్​ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే హర్షం వ్యక్తం చేశారు. పాక్​ కపట నీతిని బయటపెట్టి ఐసీజే ముందు వారి కుట్రను వివరించినట్లు తెలిపారు సాల్వే. జాదవ్‌ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశానన్నారు.

న్యాయస్థానం తీర్పు తర్వాత లండన్​లోని భారత హైకమిషన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాల్వే మాట్లాడారు.

న్యాయవాది హరీశ్ సాల్వే

"జాదవ్​కు శిక్ష రద్దు చేస్తూ వచ్చిన తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పట్టుబడిన సమయంలో అతని వద్ద స్వాధీనం చేసుకున్న పాస్​పోర్టును చూపిస్తూ జాదవ్​ జాతీయతను సవాలు చేసేందుకు పాక్​ ప్రయత్నించింది. భారత్​ వివరణతో జాతీయత, పాస్​పోర్టు సమస్య కాదని కోర్టు తీర్పునిచ్చింది. జాదవ్​ నిర్దోషి అని చెప్పే ప్రయత్నం సఫలమయింది. న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలిగాం."

-హరీశ్ సాల్వే, భారత్​ తరఫు న్యాయవాది

ఇదీ చూడండి: జాదవ్​ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే

ABOUT THE AUTHOR

...view details