తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏకపక్ష నిర్ణయంపై యుద్ధానికి సిద్ధం: అబ్దుల్లా - Mehbooba Mufti

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370, 35ఏ రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు ఆ రాష్ట్ర నాయకులు. భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.  ప్రభుత్వ నిర్ణయం నమ్మక ద్రోహమని, ఏకపక్ష నిర్ణయంపై పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత  ఒమర్​ అబ్దుల్లా.

ఏకపక్ష నిర్ణయంపై యుద్ధానికి సిద్ధం: అబ్దుల్లా

By

Published : Aug 5, 2019, 2:49 PM IST

జమ్ముకశ్మీర్​పై ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆ రాష్ట్ర ప్రధాన పార్టీల నేతలు. అధికరణ 370, 35ఏ రద్దు రాజ్యాంగ విరుద్ధమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు: ముఫ్తీ

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఆర్టికల్​ 370, 35ఏ రద్దు చేయటం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కశ్మీర్​కు ఇచ్చిన వాగ్ధానాలను భారత్​ వమ్ము చేసిందన్నారు. నేడు ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో విపత్కర పరిణామాలను కలిగిస్తుందన్నారు. ప్రజలను భయపెట్టడం ద్వారా జమ్ముకశ్మీర్​ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు ముఫ్తీ.

మెహబూబా ముఫ్తీ ట్వీట్​

పోరాటానికి సిద్ధం: ఒమర్​ అబ్దుల్లా

ఆర్టికల్​ 370 రద్దు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భాజపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని.. రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంకాని ఈ నిర్ణయాన్ని నేషనల్​ కాన్ఫరెన్స్​ సవాల్​ చేస్తుందని తెలిపారు ఒమర్​ అబ్దుల్లా. ప్రజల తరఫున ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

లేఖ విడుదల చేసిన ఒమర్​ అబ్దుల్లా

ఇదీ చూడండి: 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'

ABOUT THE AUTHOR

...view details