అయోధ్య రామమందిరం కోసం త్వరలోనే ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.
అయోధ్య కేసుపై నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రామమందిరం కోసం ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రస్ట్, ధర్మకర్తల అధికారాలు, భూమిని ట్రస్ట్‌కు బదిలీచేయడం సహా అవసరమైన నిబంధనలు రూపొందించాలని స్పష్టం చేసింది. ఇదంతా 3 నెలల్లోపు జరగాలని పేర్కొంది.