పౌరసత్వ చట్టం అమలుపై అంగుళం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు షా. పౌర చట్టంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ చట్టంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు విపక్షాలకు సవాల్ విసిరారు.
"దేశ ప్రజలందరికీ చెబుతున్నా.. ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వారి హక్కులకు రక్షణగా ఉండే పౌరసత్వ చట్టం అమలుపై మోదీ సర్కారు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాయి."