తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీలకు ఎస్పీజీ భద్రత కట్​.. ఇక నుంచి జెడ్​ ప్లస్​లోనే

గాంధీ కుటుంబానికి ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. భద్రతపై సమీక్ష అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

గాంధీలకు ఎస్పీజీ కట్​.. ఇక నుంచి జెడ్​ ప్లస్​లోనే

By

Published : Nov 8, 2019, 4:05 PM IST

Updated : Nov 8, 2019, 6:11 PM IST

గాంధీలకు ఎస్పీజీ భద్రత కట్​.. ఇక నుంచి జెడ్​ ప్లస్​లోనే

గాంధీ కుటుంబానికి ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి రక్షణగా ఉన్న ఎస్పీజీ బలగాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రతపై సమీక్ష అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

ప్రస్తుతం దేశ​ వ్యాప్తంగా సీఆర్​పీఎఫ్ బలగాల నేతృత్వంలో.. గాంధీ కుటుంబానికి జడ్​ ప్లస్ రక్షణను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

మోదీ ఒక్కరికే...!

1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసిన తర్వాత ప్రధానులకు ప్రత్యేకమైన బలగాలతో భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పీజీని స్థాపించారు. 1991మే 21న.. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఎల్​టీటీఈ టెర్రరిస్టులు హత్యచేసిన తర్వాత రాజీవ్ కుటుంబానికి ఎస్పీజీ స్థాయి భద్రత కల్పించారు. తాజాగా 28ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించారు.

1988 ఎస్పీజీ చట్టంలో 1991లో సవరణలు చేసిన అనంతరం.. వీరిని వీవీఐపీ సెక్యూరిటీ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరికే ఎస్పీజీ కమాండోల భద్రత ఉంది.

జెడ్​ ప్లస్​లో...

జెడ్‌ ప్లస్ కేటగిరీ కింద సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో రక్షణ కల్పించనున్నారు. జెడ్‌ప్లస్ సెక్యూరిటీ కింద పారామిలటరీ బలగాలకు చెందిన కమాండోలు భద్రత కల్పించనున్నారు. గార్డులతో పాటు ఈ కమాండోలు దేశవ్యాప్తంగా ఎక్కడ పర్యటించినా వారి వెంటే ఉంటారు.

ఆగస్ట్‌లో మన్మోహన్‌ సింగ్​కు తొలగింపు

1988 నాటి ఎస్పీజీ చట్టం ప్రకారం... ప్రధాని, మాజీ ప్రధానులకు మాత్రమే ఎస్పీజీ భద్రతను కల్పిస్తారు. ఐతే రాజీవ్ గాంధీ హత్యానంతరం... మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కల్పించేలా ఈ చట్టానికి సవరణలు చేశారు. ఈ నేపథ్యంలో సోనియా సహా ఆమె పిల్లలకు ఎస్పీజీ భద్రత కేటాయించారు.

Last Updated : Nov 8, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details