తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతుల బంగారు భవిత కోసం 3 సంస్కరణలు' - nirmala sitaraman statement today

ఆత్మ నిర్భర్​ భారత్​ పథకంలో భాగంగా మూడో రోజు వ్యవసాయ రంగం బలోపేతానికి సంబంధించి చర్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఆర్థిక చేయూతతో పాటు పంట నాణ్యత, రైతులు మెరుగైన మద్దతు ధర సాధించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ANBA-NIRMALA
ఆత్మ నిర్భర్​ భారత్​ పథకం

By

Published : May 15, 2020, 7:04 PM IST

కరోనా కాలంలో రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే నిర్ణయాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర్​ భారత్​ అభియాన్​ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 3 కీలక సంస్కరణలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

నిత్యావసర చట్టంలో మార్పులు..

కొరత అధికంగా ఉన్న సమయంలో 'నిత్యావసర వస్తువుల చట్టం- 1955'ను రూపొందించారని చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు మెరుగైన మద్దతు ధర అందించేందుకు చట్టానికి సవరణ చేస్తామని స్పష్టం చేశారు.

  • భారీగా పెట్టుబడులను ఆకర్షించి.. వ్యవసాయ రంగంలో పోటీతత్వాన్ని పెంచే ప్రయత్నం.
  • తృణ ధాన్యాలు, వంటనూనెలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉల్లి, బంగాళదుంప వంటి వాటిని చట్ట పరిధి నుంచి తొలగింపు.
  • అరుదైన, విపత్కర పరిస్థితుల్లో మినహా ఆహార శుద్ధి పరిశ్రమలకు సరకు నిల్వ పరిమితి నుంచి మినహాయింపులు.

ఎక్కడైనా అమ్ముకోవచ్చు..

వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే అమ్ముకోనేలా కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులు తొలగిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకువస్తామన్నారు.

  • వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి లైసెన్సు ఉన్న వ్యాపారులకే అమ్మాల్సిన అవసరం లేకుండా చర్యలు
  • దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ అమ్ముకునే సౌలభ్యం
  • అంతర్రాష్ట్ర కొనుగోళ్లపై రుసుము తొలగింపు
  • వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ఈ- ట్రేడ్ విధానం బలోపేతం

నాణ్యత పెంపునకు చర్యలు..

వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అధిక మద్దతు ధర సాధించేలా చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సీజన్​కు ముందే పంట ధరను నిర్ణయించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఇదీ చూడండి:రైతుకు ఊతం: కరోనా ప్యాకేజ్ 3.0 హైలైట్స్

ABOUT THE AUTHOR

...view details