కొవిడ్-19 (కరోనా) వైరస్ భయంతో మాస్కులకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఇదే సరైన సమయమని వ్యాపారులు వాటిని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
"ప్రస్తుతం మాస్కుల డిమాండ్, సరఫరాలకు సంబంధించి తాజా సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. మాస్కులు, శానిటరీస్ కొరత లేదని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అయితే త్వరలోనే వాస్తవాలను అంచనా వేసి.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది." - డీవీ సదానందగౌడ, కేంద్ర రసాయనాల శాఖ మంత్రి
ఇప్పటివరకు మాస్కులు వాటి ఉత్పత్తుల కొరత ఉన్నట్లుగానీ, అధిక ధరలకు అమ్ముతున్నట్లుగానీ ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి రాలేదని ఆయన వెల్లడించారు. అక్రమ నిల్వలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.