దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో జరుగుతున్న సంస్కరణలు దొంగతనంతో సమానమని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు.
"మోదీ సంస్కరణలు దొంగతనంతో సమానం. అందుకే వారు ప్రజాస్వామ్యాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు" అంటూ ట్వీట్ చేశారు రాహుల్. ఇందుకు 'టూమచ్డెమోక్రసీ' హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.