తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీపై భయాల తొలగింపునకు కేంద్రం యత్నం - UNION HOME MINISTRY

జాతీయ పౌర రిజిస్టర్​లో పేరు లేనంత మాత్రాన విదేశీయులు అయిపోరని అసోం ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర హోంశాఖ. అర్హత ఉండి రిజిస్టర్​లో పేరు లేనివారికి విదేశీ ట్రైబ్యునల్​ ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది.

ఎన్​ఆర్​సీపై భయాల తొలగింపునకు కేంద్రం యత్నం

By

Published : Aug 20, 2019, 5:58 PM IST

Updated : Sep 27, 2019, 4:31 PM IST


జాతీయ పౌర రిజిస్టర్(ఎన్​ఆర్​సీ)​ తుది పట్టికలో పేరు లేనంత మాత్రాన విదేశీయులు అయిపోరని కేంద్ర హోం శాఖ స్పష్టంచేసింది. అర్హత ఉన్న వారు తిరిగి అప్పీలు చేసుకునే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

ఎన్​ఆర్​సీలో ఆగస్టు 31వ తేదీలోపు పేరు నమోదవ్వని వారికోసం విదేశీ ట్రైబ్యునల్​లో అప్పీలు చేసుకునేందుకు 60 నుంచి 120 రోజులకు గడువును పెంచుతామని తెలిపింది కేంద్ర హోంశాఖ. 2003 నాటి పౌర నిబంధనలనూ మార్చే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది.

అసోం ముఖ్యమంత్రి సహా పలువురు ఉన్నతాధికారుతో దిల్లీలో సమావేశమై కేంద్ర హోం మంత్రి షా సహా ఈ నిర్ణయం తీసుకున్నారు.

"1946, 1964 విదేశీయుల చట్టం ప్రకారం... విదేశీయుల ట్రైబ్యునల్ మాత్రమే ఓ వ్యక్తి పరదేశీయుడని నిర్ధరించగలదు. కాబట్టి... ఎన్​ఆర్​సీలో పేరు లేనంత మాత్రాన ఆ వ్యక్తి విదేశీయుడు అయిపోడు. ఎన్​ఆర్​సీలో చోటు లభించని వారికి రాష్ట్రప్రభుత్వం తరఫున న్యాయ సహకారం అందించాలని నిర్ణయించాం."
-కేంద్ర హోంశాఖ ప్రకటన సారాంశం

ఇదీ చూడండి: హైఅలర్ట్​: దేశంలోకి ప్రవేశించిన ఐఎస్​ఐ ముఠా!

Last Updated : Sep 27, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details