దేశంలో రైళ్లు, విమాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. వీటిపై జరిగిన చర్చలు కూడా ఎలాంటి ఫలితాలు లేకుండానే ముగిశాయని స్పష్టం చేశారు.
"ఏదో ఒకరోజు రవాణా వ్యవస్థ పునరుద్ధరణ జరగాల్సిందే. అయితే అది ఏ రోజు అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు వాటిపై చర్చలు జరిపినా లాభం లేదు. ఎందుకంటే పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. రోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాం."
-- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి.