ఆయుష్ మంత్రిత్వ శాఖ దిల్లీలో నిర్వహించిన యోగా అవార్డుల వేడుకకు హాజరయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశ వ్యాప్తంగా 1.5లక్షల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 12వేల 500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు మోదీ. ఏడాదిలోగా 4000 కేంద్రాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
"యోగా సాధకులు, శిక్షకులు, ప్రపంచ వ్యాప్తంగా యోగాను విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారికి, సంస్థలకు పురస్కారాలు ప్రధానం చేసే అదృష్టం నాకు దక్కింది. అందరికీ నా శుభాకాంక్షలు. సమాజంలో సుఖ సంతోషాలు నెలకొల్పడంలో వీరంతా సఫలీకృతులయ్యారు. ఆయుష్ వైద్య విధానాన్ని అభివృద్ధి చేసిన 12 మంది ప్రముఖులతో కూడిన పోస్టల్ స్టాంపులను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశాం.ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వీటన్నింటినీ కలిపి ఆయుష్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం. ఈరోజు 10 ఆయుష్ కేంద్రాలను హరియాణలో ప్రారంభించాం."
-నరేంద్ర మోదీ, ప్రధాని