తప్పుడు మార్గాల ద్వారా గౌరవప్రదమైన ఉపాధ్యాయ కొలువు సంపాదించి సస్పెండైన నకిలీ టీచర్లపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో.. 51మంది ఉపాధ్యాయుల నుంచి రూ.13 కోట్లు వసూలు చేయనుంది యూపీ సర్కార్.
విధుల నుంచి బహిష్కరించిన 51మంది ఉపాధ్యాయుల్లో 39మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సహా.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు టీమ్‌ను ఏర్పాటు చేశారు.