తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శబరిమల ప్రవేశంపై ఆ తర్వాతే నిర్ణయం' - అన్ని వయసుల మహిళల ప్రవేశం

అతి సున్నితమైన శబరిమల ఆలయంలోకి  మహిళల ప్రవేశంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై న్యాయకోవిదులను సంప్రదించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ పేర్కొన్నారు.  తీర్పుపై ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.

'శబరిమల ప్రవేశంపై ఆ తర్వాతే నిర్ణయం'

By

Published : Nov 15, 2019, 5:21 AM IST

'శబరిమల ప్రవేశంపై ఆ తర్వాతే నిర్ణయం'

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో న్యాయకోవిదులను తమ ప్రభుత్వం సంప్రదించనుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఏళ్లుగా మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఇవాళ విచారణ సందర్భంగా శబరిమల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి మహిళల ప్రవేశం అంశంపైనా ఈ ధర్మాసనం పరిశీలించనుంది.

ఈ నెల 17 నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో విజయన్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ఆలయ ప్రవేశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

కోర్టు ఉత్తర్వులు ఏవైనా సరే అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. కొన్ని అంశాల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే విధించలేదని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

ABOUT THE AUTHOR

...view details