తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రీడల్లో డోపింగ్​ను అరికట్టేందుకు జాతీయ వేదిక - డోపింగ్​

డోపింగ్​ భూతాన్ని అరికట్టేందుకు ఓ జాతీయ వేదికను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ "నేషనల్​ కంప్లయెన్స్ ప్లాట్​ఫారమ్​ అగైనస్ట్​ డోపింగ్​ ఇన్​ స్పోర్ట్​​" పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ ప్యానెల్​కు క్రీడాశాఖ కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు. 10మంది సభ్యులు ఉండే ఈ ప్యానెల్​లో భారత ఒలింపిక్​ అసోసియేషన్​ అధ్యక్షుడు సహా ఇతర కీలక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఉండనున్నారు.

Govt to constitute National Compliance Platform against Doping in Sport
క్రీడల్లో డోపింగ్​ను అరికట్టేందుకు జాతీయ వేదిక

By

Published : Jul 2, 2020, 8:48 PM IST

క్రీడా రంగంలో డోపింగ్​ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డోపింగ్​ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఓ జాతీయ వేదికను ఏర్పాటు చేయనుంది. "నేషనల్​ కంప్లయెన్స్ ప్లాట్​ఫారమ్​ అగైనస్ట్​ డోపింగ్​ ఇన్​ స్పోర్ట్​​" పేరుతో ఈ వేదికను ఏర్పాటు చేయనుంది. దీనికి క్రీడాశాఖ కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. యునెస్కో జనరల్​ కాన్ఫరెన్స్​ ఆమోదించిన అంతర్జాతీయ తీర్మానానికి ఈ వేదిక కట్టుబడి ఉంటుంది.

భారత ఒలింపిక్​ అసోసియేషన్​ అధ్యక్షుడు, నేషనల్​ యాంటీ-డోపింగ్​ ఏజెన్సీ డైరక్టర్​ జరనల్(ఎన్​ఏడీఏ డీజీ)​.. ఇందులో సభ్యులుగా వ్యవహరించనున్నారు. మొత్తం పది మంది సభ్యులు ఉండే ఈ ప్యానెల్​లో హోం, విదేశాంగ, ఆర్థిక, మానవ వనరులు, ఆరోగ్య, న్యాయశాఖకు చెందిన ప్రతినిధులు ఉండనున్నారు.

2005లో 33వ యునెస్కో జనరల్​ కాన్ఫరెన్స్​లో క్రీడల్లో డోపింగ్​పై పోరుకు సభ్య దేశాలు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ సభ్య దేశాల్లో భారత్​ కూడా ఉంది.

ABOUT THE AUTHOR

...view details