చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన మిలిటరీ స్థాయి చర్చలపై సీఎస్జీ(చైనా స్టడీ గ్రూప్) సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. బలగాల ఉపసంహరణ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాని వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
సరిహద్దులో భారత్-చైనా మధ్య మే నెల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయీ భేటీ 12గంటల పాటు సాగింది.
సీఎస్‌జీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, త్రిదళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి:-'సరిహద్దులో శాంతికి భారత్-చైనా అంగీకారం'
'చైనాదే బాధ్యత...'