అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో వచ్చే నెలలో సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై భేటీలో చర్చించనున్నట్లు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.
రోజుకు 25-30 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయని.. ఇందులో మూడింట రెండొంతులను మాత్రమే తిరిగి సేకరిస్తున్నట్లు చెప్పారు జావడేకర్. మిగిలిన ప్లాస్టిక్ బీచ్లలో, రోడ్లపై, ఇతర ప్రాంతాల్లో చెత్త రూపంలో పర్యావరణంలోనే ఉంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాదికి 30కోట్ల మెబైల్ ఫోన్లు వాడుకలో లేకుండా పోతున్నాయని... వాటిని రీసైకిల్ చేయడం సమస్యగా మారిందని జావడేకర్ చెప్పారు.