కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఉద్యోగాలు, పొదుపుచేసుకున్న సొమ్మును ప్రజల నుంచి సర్కార్ లాక్కుపోతోందని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అయినా తప్పుడు కలలను చూపుతూ ప్రజలను మభ్య పెడుతోందని విమర్శించారు.
కరోనా కష్టాల కారణంగా గత 4 నెలల్లో పీఎఫ్ ఖాతాల నుంచి రూ.30వేల కోట్లను ప్రజలు ఉపసంహరించుకున్నారని ఓ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను జత చేస్తూ హిందీలో ట్వీట్ చేశారు రాహుల్. దీనిని ఆధారంగా చూపుతూ కేంద్రంపై విమర్శలు చేశారు.