పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ నుంచి లబ్ధిపొందడం మానుకుని.. పెంచిన ధరలు, ఎక్సైజ్ సుంకాలను మోదీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. "స్పీక్అప్ అగైనస్ట్ ఫ్యూయల్ హైక్" కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు రాహుల్.
"మే 25 నుంచి 22సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం కేంద్రం చేసిన అతిపెద్ద తప్పు. ఒక్కసారి కాదు.. మొత్తం 22సార్లు ధరలను పెంచింది. పేదల జీవితాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. పెట్రోల్, డీజిల్ నుంచి లబ్ధిపొందడం మానుకుని కేంద్రం తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలి. ఈ విషయంలో మనం అందరం ఒకే తాటిపై ఉంటేనే ప్రభుత్వానికి అర్థమవుతుంది. అప్పుడే ఇంధన ధరలను తగ్గిస్తుంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.